గిర్మాజీపేట, ఏప్రిల్ 28: రంజాన్ అంటేనే రక రకాల వస్ర్తాలు, గాజులు, టోపీలు, అలంకార వస్తువులు, తినుబండారాలు, బిర్యానీ ఘుమఘు మలు, ఇరానీ చాయ్, అత్తరు సువాసనలు.. ఇవ న్నీ కొనడానికి ముస్లింలు ప్రత్యేక శ్రద్ధ చూపుతా రు. దీంతో నగరంలోని మార్కెట్లలో రంజాన్ పండుగ సందడి నెలకొంది. రంజాన్ చివరి శుక్ర వారం కావడంతో వరంగల్‌లోని మండి బజార్, హనుమకొండ చౌరస్తా, కాజీపేట తదితర ప్రాం తాల్లో ముస్లింలు షాపింగ్ కోసం క్యూ కట్టారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పండుగకు దూ రంగా ఉన్న ముస్లింలు ఈ ఏడాది రంజాన్ పండు గను ఘనంగా కుటుంబసభ్యులతో జరుపుకోవ డానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే కుటుంబసమేతంగా బట్టలు, అత్తరు, చెప్పులు, టోపీలు, జ్యువెల్లరీ ఐటెమ్స్, గాజులు, కప్పులు, సాసర్లు, ఖీర్(పాయసం) తయారీలో వాడే జీడి పప్పు, బాదం, పిస్తా, కాజూ మొదలగు సరుకుల ను కొనేందుకు రావడంతో మండి బజార్ బిజీగా మారింది. రేపటి నుంచి ఇక్కడ వన్‌వే పెట్టనున్న ట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో హలీమ్, కబాబ్ దుకాణాలు కూడా రద్దీగా మారాయి.