పట్టుకున్న రేషన్ బియ్యం ఏమైనట్లు?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాత్రికి రాత్రే బియ్యం మాయం కావడం చర్చనీయాంశంగా మారింది.
- రాత్రికి రాత్రే మాయం
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి7(నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాత్రికి రాత్రే బియ్యం మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రేగొండ మండలానికి చెందిన ఓ బియ్యం వ్యాపారి డీసీఎం వాహ నంలో రేషన్ బియ్యాన్ని ఛత్తీస్గఢ్కు అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొంత మంది యువకులు కారులో డీసీఎం వాహనాన్ని వెంబడించి భూపాలపల్లి పట్టణంలో అడ్డుకున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు డీసీఎం వాహనాన్ని అడ్డుకున్న వ్యక్తులను చితకబాది వారి సెల్ఫోన్లు లాక్కున్నట్లు సమాచారం.
అనంతరం పోలీసులు బియ్యంతో ఉన్న డీసీఎం వాహనాన్ని వదిలేసినట్లు తెలిసింది. అయితే ఆ బియ్యం వ్యాపారి ఎవరు?, ఎవరి పైరవీతో బియ్యం వాహనాన్ని పోలీసులు వదిలేశారనే విషయం భూపాలపల్లిలో హాట్ టాఫిక్గా మారింది. ఇటీవలే బాంబులగడ్డ వద్ద ఒక ఇంట్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు పట్టుబడిన బియ్యం వాహనాన్ని ఎందుకు వదిలేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డీఎస్పీ రాములును వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, విచారణ జరుపుతానని అన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

