మీరే నా బలం.. నా బలగం
ప్రజా సమస్యలు పట్టని వారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని వ్యక్తులు ఎన్నికలు రాగానే నాపై యుద్ధం చేసేందుకు వస్తున్నారని, మీరే నా బలం... నా బలగం.. మీరు నా వెంట ఉన్నంత వరకు మీ ఆశీర్వాదం ఉన్నంతవరకు సేవ చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
- సంఘాలు సంఘటితంగా పని చేయాలి
- బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం సంతోషకరం
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
- బాలసముద్రంలో కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్, యూనికాన్ ఆర్గానిక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సమావేశం
హనుమకొండ, నవంబర్ 5 : ప్రజా సమస్యలు పట్టని వారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని వ్యక్తులు ఎన్నికలు రాగానే నాపై యుద్ధం చేసేందుకు వస్తున్నారని, మీరే నా బలం… నా బలగం.. మీరు నా వెంట ఉన్నంత వరకు మీ ఆశీర్వాదం ఉన్నంతవరకు సేవ చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, యూనికాన్ ఆర్గానిక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆత్మీయులను చూస్తే ధైర్యం వస్తుందన్నారు. మీలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. ఐదేళ్లు కనబడని వ్యక్తులు ఐదు నెలల ముందు మాత్రం ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్నా రని, వారితో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజల సమస్యలపై వారికి అవగాహన లేదని, వారి పార్టీలోనే వర్గ పోరు ఉందన్నారు. సంఘాలు అన్ని సంఘటితంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మందికి పదవులు ఇచ్చారని, తనకు కూడా చీఫ్ విప్ పదవి ఇస్తే ఆ హోదాను స్వార్థం కోసం వాడుకోకుండా ప్రజల మధ్యలోనే ఉన్నానని పేర్కొన్నారు.
30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలంతా అండగా ఉన్నారన్నారు. సంఘాల సంఘటితంగా సంపూర్ణ మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. కొంతమంది నాయకులు అభివృద్ధిపై అవగాహన లేకుండా, నియోజకవర్గం గురించి తెలియని వారు కూడా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వమర్శించారు. అభివృద్ధి అనేది నిరంత ప్రక్రియ అని, రూ. 5 వేల కోట్లతో అనేక అభివృద్ధి, సంక్షేమ పనులను ఈ నియోజకవర్గంలో చేశానని తెలిపారు. ఒక్కో సంఘానికి ఒక్కో సమస్య ఉంటుందని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఒకరూ బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగర సుందరీ కరణ, పారులు, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. మెడికల్ షాపుల యజమానులు, అందులో పని చేసే కార్మికులకు సహాయ సహకారాలు అందించానన్నారు. అంతేకాకుండా చిరు వ్యాపారుల సమస్యలను పరిషరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, హనుమకొండ డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మధుకర్‌రావు, కోశాధికారి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు శివాజీ, యూనికాన్ ఆర్గానిక్ లిమిటెడ్ అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి రామచందర్, నాయకులు బాలరాజు, నబీ, నాగేశ్వరరావు, ప్రభాకర్‌రావు, రమేశ్, దేవ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

