ఖిలావరంగల్. జూలై 30: జిల్లాలో 14,510 మంది రైతులకు రూ. 142.58 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి లైవ్‌ను వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు ఎదురైతే గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు తీసుకున్న, రెన్యువల్స్ చేసుకున్న రుణాలు వడ్డీతో సహా రూ. 2 లక్షల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. రైతు కుటుంబానికి రూ. 2 లక్షల కంటే అధికంగా రుణం ఉంటే కుటుంబంలోని మహిళ పేరుపై ఉన్న రుణం నిబంధనల మేరకు ముందుగా మాఫీ అవుతుందన్నారు. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
జిల్లాలోని 13 మండలాల రైతుల సౌకర్యార్థం రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారానికి మండలాల్లో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశామన్నారు. రుణమాఫీ కాని రైతులు గ్రీవెన్స్‌కు వెళ్లి తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటికే రూ. లక్ష రుణం ఉన్న వారికి మాఫీ అయిందన్నారు. అనంతరం టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతులమీదుగా రెండో విడుత రుణమాఫీ చెక్కును రైతులకు అందజేశారు. కార్యక్రమంలో డీఏవో ఉషాదయాళ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, డీహెచ్‌వో శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండో విడుత రుణమాఫీ కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేశారు. అయితే, కరెంటు కోతలు ఉండవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పటికే సమావేశానికి హాజరైన రైతులు అప్రకటిత విద్యుత్ కోతతో నవ్వుకోవడం కొసమెరుపు.