మత్తు యువతను చిత్తు చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ వినియోగం పెరుగుతున్నది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గుట్టుగా గమ్యస్థానాలకు చేరుతున్నది. పోలీసులు కొంత వరకు కట్టడి చేసినా ప్రతి రోజూ ఏదో ఒక దగ్గర పట్టుబడుతూనే ఉన్నది. దీంతో యువత మత్తుకు బానిసవుతూ వారి జీవితాలను ఆగం చేసుకుంటున్నది. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి గంజాయి విక్రయాలు, రవాణాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మరిపెడ, ఆక్టోబర్ 15
గంజాయి రవాణా జోరుగా సాగుతున్నది. దీంతో చాలామంది యువకులు దానికి బానిసవుతున్నారు. మరిపెడ మండలంలోని గంజాయికి అలవాటు పడి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అడ్డగించిన దాఖలాలు ఉన్నాయి. ఇటీవల ఓ విద్యార్థి కోమాలోకి వెళ్లిన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. నర్సింహుల పేట మండలంలో గంజాయి రవాణాను ఖరీదైన కార్లలో సరఫరా చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో గంజాయి మత్తులో ఓ మైనర్ హత్య కేసులో జైలుకు వెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో గంజాయిని సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. చిన్నగూడురు మండలంలోని జయ్యరం గ్రామ శివారులో యువకులు విచ్చలవిడిగా గంజాయి కలిగిన సిగరెట్లు తాగుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఇటీవల చిన్నగూడురు మండలానికి చెందిన అధికార పార్టీ యువ నాయకుడు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
చీకటిపడితే చాలు..
చీకటిపడితే చాలు చాలా గ్రామాల్లో యువకులు రహస్య ప్రదేశాలకు వెళ్లి గుంపులుగా ఓ చోట చేరి గంజాయి సిగరెట్లు తాగి మత్తుకు లోనవుతున్నారు. యువకులు, మైనర్లు కూడా అలవాటు పడుతున్నారు. అసలు గంజాయి ఎకడి నుంచి సరాఫరా అవుతుంది?. ఎవరు తీసుకొస్తున్నారు?. స్థ్ధానికంగా ఎవరు విక్రయిస్తున్నారు?. అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల కిరాణా, పాన్పాపుల సమీపాల్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం.
అక్కడక్కడా పట్టుబడ్డా జోరుగా రవాణా
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్కడక్కడా గంజాయి పట్టుబడ్డా రవాణా ఆగడం లేదు. సీక్రెట్‌గా వాహనాల్లో తరలిస్తూ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు