హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 23 : ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21 రద్దు చేయాలని వరుసగా మూడవరోజు పార్ట్ టైం అధ్యాపకులు కేయు పరిపాలనా భవనం ముందు తమ అత్యున్నత విద్యార్హత డాక్టరేట్‌ని ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేయూ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు జీవో నెంబర్ 21 లో పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్ ని అధ్యాపక నియామకాలలో పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమన్నారు. విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి మినిమం టైం స్కేలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, అధ్యాపక నియామకాలలో ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేంద్రనాయక్, పార్ట్ టైం అధ్యాపకులు డాక్టర్ దేవోజి నాయక్, డాక్టర్ మోహన్, డాక్టర్ వినోద, డాక్టర్ భాగ్యమ్మ, డాక్టర్ చారి, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సంజీవ్, డాక్టర్ సుజాత, డాక్టర్ రవీందర్, డాక్టర్ విజయ, డాక్టర్ వాణిదేవి, డాక్టర్ సరిత, డాక్టర్ జోత్స్న, డాక్టర్ మౌనిక, డాక్టర్ మాధవి, డాక్టర్ కవిత, డాక్టర్ కుమార్ స్వామి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ సురేష్, డాక్టర్ ఫణి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శంకర్, డాక్టర్ వావిళ్ళ కుమార్, డాక్టర్ రమేష్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ రజనీకుమార్, డాక్టర్ సుమలత, డాక్టర్ వీణ, డాక్టర్ జాస్మిన్, డాక్టర్ స్వామిచరణ్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సాయి పాల్గొన్నారు.