చెన్నారావుపేట: అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలను అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దంది మాధవరెడ్డి (MLA Madhav Reddy) అన్నారు. శనివారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా చీరల పంపిణీ ( Sarees Distribution ) కార్యక్రమాన్ని ఆర్డీవో ఉమారాణితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. మండలంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీరలు అందుతాయని ఆందోళన చెందవద్దని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి బాలకృష్ణ, తహసీల్దార్ అబిద్ ఆలీ, ఎంపీడీవో శివానంద్, నాయకులు పాల్గొన్నారు.