సంగెం, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి వేడుకలు మండలంలో శనివారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆయా కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు చింతలపల్లి, సంగెంలోని సంగమేశ్వరాలయాన్ని సందర్శించారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయాల్లో పూజలు చేసి సంగమేశ్వర స్వామికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఎమ్మెల్యే వెంట రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సారంగపాణి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ కుమారస్వామియాదవ్, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, నాయకులు సాగర్‌రెడ్డి, కోటేశ్వర్, కోడూరి సదయ్య, పులి వీరస్వామిగౌడ్, మునుకుంట్ల మోహన్, ఆగపాటి రాజ్‌కుమార్, అర్చకులు అప్పె నాగేంద్రశర్మ, నాగార్జున శర్మ, సముద్రాల సుదర్శనాచార్యులు పాల్గొన్నారు.
సంగెం : బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్‌రంగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బోనాల ప్రవీణ్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పార్టీ బీమా కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతుల ప్రభాకర్, ఎంపీటీసీ పద్మ-శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పెద్దగోని లక్ష్మీనారాయణ, అశోక్, శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ : మహా శివరాత్రి సందర్భంగా 16వ డివిజన్ కోటిలింగాల ఆలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని అధికారులు, పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుంకరి మనీషా శివకుమార్, ఆకులపల్లి మనోహర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.