ములుగు, జనవరి12(నమస్తేతెలంగాణ): ములుగు జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపిస్తూ సర్కారు సొమ్మును లూటీ చేస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందేందుకు వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రతి నెల వేతనంతో పాటు అధికారులకు వాహన సౌకర్యాన్ని కూడా అందిస్తున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని కొం దరు తమ సొంత వాహనాలను అద్దెకిచ్చినట్లు చూ పుతూ కిందిస్థాయి సిబ్బందిని డ్రైవర్లుగా నియమించుకొని వాహన అలవెన్స్‌ను పొందుతున్నారు. మరికొందరు తమ బంధువుల పేర్లపై వాహనాలను కొ నుగోలు చేసి తాము అద్దెకు తీసుకున్నట్లు చూపుతూ ప్రభుత్వ నిధుల నుంచి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు దండుకుంటున్నారు. జిల్లాలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు వాహన సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుండగా, ఇందులో 50 శాతం మేర సొంత వాహనాలనే అద్దెకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. విద్యుత్, విద్య, వైద్యారోగ్య, డీఆర్డీఏ, సంక్షేమ శాఖలతో పాటు మరికొన్ని శాఖల్లో పనిచేస్తున్న అధికారులు అద్దె వాహనాల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు.
అద్దె వాహనాలను వాడకుండానే బిల్లులు
కొన్ని శాఖల అధికారులు ప్రభుత్వం సమకూర్చిన అద్దె వాహనాలను తమ ఇంటి అవసరాలకు వాడుకుంటూ ప్రతి నెల బిల్లులను మాత్రం సర్కారు నుంచి పొందుతున్నారు. అధికారులు కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు, విధి నిర్వహణలో వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ఈ వాహనాలను ఉపయోగించాల్సి ఉం టుంది. ఇందుకు విరుద్ధంగా ములుగు డీఆర్డీఏలో పనిచేస్తున్న డీపీఎంలు సొంత వాహనాలను అద్దెకు చూపి స్తూ వాటిని సైతం వినియోగించడం లేదు. కొందరు బస్సుల్లో, మరికొందరు ద్విచక్రవాహనాలపై విధులకు హాజరవుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగుల్లో ఎవరికైనా వాహనం ఉంటే దానిలో వెళ్తున్నారు.
ఓ డీపీఎం సీసీని మచ్చిక చేసుకొని బస్సు దిగిన అనంతరం అతని ద్విచక్రవాహనంపై గ్రామాల్లో పర్యటిస్తున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు సీసీ తన విధులను మరిచి సారు సేవలకు పరిమితమవుతున్నాడు. మరో ఇద్దరు డీపీఎంలు ములుగు నుంచి జాకారం వరకు ప్రతి రోజూ ద్విచక్రవాహనంపై వెళ్లి విధులకు హాజర వుతూ అద్దె కారు పేరు తో ఆదాయం పొందుతున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా అద్దె వాహనాల పేరుతో కొందరు అధికారులు అలవెన్స్‌ల పేరుతో బిల్లులు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు చర్యలు చేపడితే ఎంతో మం ది నిరుద్యోగులు, వాహనదారులకు ఉపాధి కల్పించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.