బచ్చన్నపేట, సెప్టెంబర్ 24 : ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్న పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజల భద్రతనే పోలీస్ బాధ్యత అని బచ్చన్నపేట ఇన్చార్జి ఎస్ఐ చెన్నకేశవులు అన్నారు. బుధవారం యువతకు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లు నేర్చుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలువాలన్నారు. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కానీ, 100 కానీ ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి న్యాయం చేస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ప్రజలు అందరూ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నర్సిరెడ్డి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.