పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అత్యాధునిక హంగులు, సరికొత్త శైలిలో శాశ్వత ప్రాతిపాదికన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్‌కు ఆజంజాహి మిల్లు గ్రౌండ్ స్థలంలో జూన్ 17న మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ కలెక్టరేట్ నమూనాతో రూపొందించిన ఫ్లెక్సీని ప్రదర్శించగా అటుగా వెళ్లే వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తూ వావ్ సూపర్ అంటూ సెల్ఫోన్లలో బంధించడం కనిపించింది.
– వరంగల్ ఫొటోగ్రాఫర్, సెప్టెంబర్ 7