ఖిలావరంగల్, సెప్టెంబర్ 13 : వరంగల్ శివనగర్‌లో కరెన్సీ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వినాయక ఉత్సవ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రూ.కోటిన్నర నగదుతో అలంకరించి ధనలక్ష్మి పూజ చేశారు. కరెన్సీ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు దిగారు.