సివిల్ సప్లయ్స్లో అక్రమ దందా!
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ అంటూ ఆ శాఖ ఉన్నతాధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొందరు రైస్ మిల్ల ర్లు ఆరోపిస్తున్నారు. తన సబార్డినేట్ ఉద్యోగులతో కలిసి తనిఖీకి వస్తున్న ఆయన వివిధ కారణాలు చూపుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మిల్లర్లు మండిపడుతున్నారు.
- తనిఖీల పేరిట ఓ ఉన్నతాధికారి వసూళ్లు
- సన్న బియ్యం కేటాయింపుల్లోనూ చేతివాటం
- సీఎంఆర్ ఇస్తున్న మిల్లుల్లోనే తనిఖీలు
- ప్రారంభించని మిల్లుల వైపు చూడని వైనం
- ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న మిల్లర్లు?
హనుమకొండ, మార్చి 29 : హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ అంటూ ఆ శాఖ ఉన్నతాధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొందరు రైస్ మిల్ల ర్లు ఆరోపిస్తున్నారు. తన సబార్డినేట్ ఉద్యోగులతో కలిసి తనిఖీకి వస్తున్న ఆయన వివిధ కారణాలు చూపుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మిల్లర్లు మండిపడుతున్నారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) మొదలు పెట్టిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్న సదరు అధికారి, ఇప్పటి వరకు ప్రారంభించని వాటివైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లు సందర్శనకు వచ్చినపుడు రిజిస్టర్లలో సంతకం కూడా చేయడం లేదని, తనిఖీల పేరిట అక్రమ వసూళ్లకే సదరు అధికారి వస్తున్నారని, గతంలో ఎవరూ ఇలా వ్యవహరించలేదంటున్నారు.
అన్నీ సక్రమంగా ఉన్నా అమ్యామ్యాలు ముట్టజెప్పకపోతే ఏవేవో కారణాలతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలువురు రైస్ మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు సామర్థ్యాన్ని బట్టి రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో సదరు అధికారి జి ల్లాకు బదిలీపై వచ్చినపుడు షిఫ్టింగ్ కోసం కొందరు రైస్ మిల్లర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. తను నేరుగా తీసుకోకుండా తన వద్ద పనిచేసే డ్రైవర్ ఖాతాలో వేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు అధికారికి గతంలో పనిచేసిన జిల్లాల్లో సైతం అవినీతి ఆరోపణలున్నాయని పలువురు మిల్లర్లు అంటున్నారు.
డబ్బులిస్తేనే సన్న బియ్యం కేటాయింపు..
గత వానకాలంలో జిల్లాలోని 16 బాయిల్డ్, 44 రా రైస్ మిల్లులకు ట్యాగింగ్ చేశారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో మిల్లులకు పంపించిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు బి య్యంగా మార్చి జనవరి నుంచి ప్రభుత్వానికి ఇ వ్వాల్సి ఉంటుంది. అయితే మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొందరు రైస్ మిల్లర్లు సీఎంఆర్ ప్రారంభించలేదు. అయితే అక్కడకు వెళ్లి తనిఖీలు చేపట్టాల్సిన సదరు అధికారి మా మూళ్లు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడడంలేదని, సీఎంఆర్ ప్రారంభించిన మిల్లులకు తనిఖీ అంటూ వచ్చి ఇబ్బందులు పెట్టడం ఏమిటని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు.
అలాగే డబ్బులిచ్చిన వా రికే సన్నబియ్యం కేటాయిస్తున్నట్లు మిల్లర్లు వా పోతున్నారు. సీఎంఆర్ క్లియర్గా ఉన్నప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మిల్లర్లు మండిపడుతున్నారు. కాగా, సదరు ఉన్నతాధికారి అక్ర మ వసూళ్లు, ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై రెండు, మూడు రోజుల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు మిల్లర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో ఏ అధికారి ఇలా వ్యవహరించలేదని, ఇబ్బందులు పెట్టలేదని, కార్యాలయం చుట్టు అనేకసార్లు తిరగాల్సి వస్తుందని మిల్లర్లు వాపోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

