అక్టోబర్ 27 : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని, టార్చ్ లైట్లు కొనుక్కొని పొలాల వద్దకు పోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాకతీయ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే ముందు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమానికి వరంగల్ నగరం, కేయూ కేంద్ర బిందువుగా మారిందన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ దగాపడిందనారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి రాష్ట్రం సిద్ధించే వరకు పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారని… టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్) అన్ని పార్టీల మద్దతు కూడగట్టి పోరాడి ఒత్తిడి తేవడంతోనే రాష్ట్రం సిద్ధించిందన్నారు. 2001 నుంచి తెలంగాణ ఇస్తామని రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. ఆ పార్టీ విధానాలతోనే శ్రీకాంతాచారి ఆత్మహత్మతో పాటు అనేక మంది బలిదానాలు చేసుకున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీఎం తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అన్న విషయాన్ని వినోద్‌కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్ర రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు రావడం ఖాయమన్నారు.
టీపీపీసీ అధ్యక్షుడు రేవంతర్‌రెడ్డి రైతులకు 3గంటలకు కరెంటు చాలని అనడం రైతులను మోసం చేయడమేనన్నారు. 2014కు ముందు తెలంగాణను, ఇప్పటి తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ప్రజలు, మేధావులు విశ్లేంచాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో పోచంపహాడ్, ఎస్సారెస్సీ ప్రాజెక్టులు మాత్రమే కట్టారని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా 44వేల చెరువులకు మరమ్మతు చేపట్టామన్నారు. తద్వారా భూ గర్భజలాలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు కావడంతోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఇతర దేశాలు, రాష్ర్టాల ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 93లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయని, వీరందరికీ కేసీఆర్ బీమా వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వం దవాఖానల్లో మౌళిక వసుతులు కల్పించి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వరంగల్ నగరంలో 24 అంతస్తులతో దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా తెలంగాణలో పథకాలు ఆగిపోలేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని 1.33 లక్షల ఉద్యోగాలను తెలంగాణలో ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు నియమించిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు నగరంలో జరిగిన అభివృద్ధిని చూడాలని వినోద్‌కుమార్ కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను బిఆర్ఎస్ పార్టీ పశ్చిమ నియోజక వర్గం అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమని, ప్రజలు కూడా అలాగే ఆదరిస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ అన్నారు. ఏ వాడకెళ్లినా ప్రజలు ఎంతగానో ఆదరించి, ఆశీర్వదిస్తున్నారన్నారు. ప్రతిచోట ప్రభుత్వ లబ్ధిదారులు ఎందరో ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. 2009 నుండి ఇప్పటి వరకు కేసీఆర్‌కు నమ్మకంగా ఉంటూ పనిచేస్తున్నానన్నారు. డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఎంతగానో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. గతంలో కంటే ఈ సారి 50వేలకు పైచిలుకు మెజార్టీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. రెట్టింపు ఉత్సాహంతో అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ చీకటి శారద, మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి