Kadiyam Srihari | ఎల్నినో ప్రభావంతో ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు వేసిన పంటలు ఎండిపోతున్న రైతులను కాంగ్రెస్ సర్కార్ నీళ్లను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ రైతులతో కలిసి పాదయాత్ర కూడా చేపట్టింది. కాంగ్రెస్ సర్కార్ నీటిని విడుదల చేయకుండా రైతులను ఎలా వేధిస్తుందో చెప్పేందుకు స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ.. నేను నీళ్లు ఇస్తానని మీకు హామీనిస్తే.. ఆ హామీ మీద మీరు పొలం వేసుకుంటే ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో నీళ్లు రాకపోతే పంట ఎండిపోతే నన్ను శాపనార్ధాలు పెడతారు. ఏమైనా ఆరుతడి పంటలు వేసుకుండి.. మొక్కజొన్న, కందులు, పెసర్లు లాంటి వేసుకోండి.. వరినే వేసుకోవాలంటే ఇంకో వారం పది రోజులు సమయం ఉంది. మన అదృష్ణం బాగుంటే వర్షాలు పడతాయి.. వరి పంట వేసుకోవచ్చు. కానీ తొందర పడి ఆగం కావొద్దు.. నేను ప్రస్తుతం నీళ్లిచ్చే పరిస్థితిలో లేను. నా ప్రయత్నమంతా చేస్తున్నా.. దేవాదుల నుంచి నీటిని తీసుకొస్తున్నానని చెప్పుకొచ్చారు.
సాగు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో కడియం కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
నేను నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో లేను
వరి పంట వేయకండి
కందులు, పెసర్లు లాంటి పంటలు వేసుకోండి
లేకపోతే వారం రోజులు ఆగండి, అదృష్టం బాగుండి వర్షాలు పడితే వరి పంట వేసుకోవచ్చు
–కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి pic.twitter.com/F0Skx0k5Fd
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు