ఖిలావరంగల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తుందని శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర స్వామి అన్నారు. శుక్రవారం శివనగర్, మైసయ్య నగర్ ప్రాంతంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్కాలర్షిప్ లు, యూనిఫామ్, బియ్యంతో కూడిన భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందన్నారు.
ఆహ్లాదకర వాతావరణం విశాలమైన తరగతి గదులతో అన్ని మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్పించి బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు బాసర త్రిబుల్ ఐటీలో సీట్లు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసు, దేవరాజు అంజయ్య, నరేందర్, రంగాచారి, సంపత్,కవిత,స్వప్న, సుహాసిని, ధనలక్ష్మీ, భవాని, కిరణ్మyi తదితరులు పాల్గొన్నారు.