హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఆర్టీసీ అధికారుల విధానాలు ఉన్నాయని హైర్బస్ ఓనర్ల వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపెల్లి రాంరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో హైర్బస్ ఓనర్ల రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడారు. 2021లో వర్తింపజేయాల్సిన వేతన ఒప్పంద సర్క్యులర్ 38/2022ను ఇప్పుడు సవరిస్తూ తీసుకుంటున్న ఆర్టీసీ అధికారుల చర్యలు అనాలోచితమని, 2022లో కొన్ని బస్సులకు, 2023లో కొన్ని బస్సులకు వర్తింపజేస్తున్నారని, లోపభూయిష్టమైన సర్క్యులర్‌ను వెంటనే సవరించాలన్నారు.
మహాలక్ష్మీ స్కీమ్‌కు అధిక బస్సులు అవసరమైనప్పటికీ ఎవరూ టెండర్లో పాల్గొనకుండా కొందరు కుట్రపన్నుతున్నారని, ఏదైనా కారణంతో బస్సు ఆగితే రోజుకు రూ.35వేలు రికవరీ చేస్తామనడం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమేనన్నారు. ఆలోచన విధానాలకు నిరసనగా జనవరి 5 నుంచి అద్దెబస్సుల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కె.సదానందం, జే.సునీల్‌రెడ్డి, హబీబుద్దీన్ పాల్గొన్నారు.