చెన్నారావుపేట : చెన్నరావుపేట మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు అన్నదాతలు అతలాకుతలమయ్యారు. చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల వరి పంట పూర్తిగా నేలమట్టమయింది. మండల కేంద్రంలోని బతుకమ్మ సెంటర్లో కౌలు రైతు నాలుగు ఎకరల్లో పండించిన మక్కలను ఆరబోయగా వరదకు కొట్టుకుపోయాయి.
సగం పంట వరదకు కొట్టుకుపోయిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. అలాగే రాత్రి వీచిన విపరీతమైన గాలికి మండల కేంద్రంలో నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇండ్లపైన రేకులు ఎగిరిపోయాయి. గూడు చెదిరిపోయిన పలువురు తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు.