పరకాల/శాయంపేట/వాజేడు/కన్నాయిగూడెం, డిపెంబర్ 2 : తుపాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీం తో హనుమకొండ జిల్లా పరకాల, శాయంపేటతోపాటు ములుగు జిల్లా వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో కొనుగోలు కేంద్రా ల్లోని ధాన్యం తడిసిముద్దయింది. పరకాల మార్కెట్ ఆవరణలో కాంటాలైన ధాన్యంతోపాటు కాం టాలకు సిద్ధంగా ఉన్న బస్తా లు, ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. మరికొందరు రైతులు తమ ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి కా పాడుకున్నారు.
అలాగే, శాయంపేట మండలంలోని ఆరెపల్లి, శాయంపేట, పత్తిపాక, మై లారం తదితర గ్రామాల పరిధిలో కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. కన్నాయిగూడెంమండలంలో సాయంత్రం తేలికపాటి వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ని వడ్ల రాశులపై రైతులు టార్పాలిన్లు, బరకాలు కప్పారు. ధాన్యంపై కప్పేందుకు ప్రభు త్వం నుంచి ఒక్క టార్పాలిన్ కూడా అందించలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాజేడులోనూ రైతులు ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టారు. దీనికి తో డు కోతకొచ్చిన వరి పంట కూడా తడుస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.