బచ్చన్నపేట, జూలై 29 : జనగామలో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా శుక్రవారం కురిసిన వానతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.
చిరు జల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బచ్చన్నపేట మండలంలోని బండనాగారం, కట్కూర్ శివారు ప్రాంతాల్లో రాళ్ల వాన పడినట్లు రైతులు చెప్పారు.