రాయపర్తి/తొర్రూరు/ఐనవోలు, డిసెంబర్ 4 : రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాయపర్తి మండలంలోని బంధన్‌పల్లి, అవుసులకుంటతండా, గట్టికల్, కొండాపురం, సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జయరాంతండా(ఎస్), ఎర్రకుంట తండా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని గురువారం ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గట్టికల్ గ్రామ అధ్యక్షుడు మేరుగు సంతోష్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు చెవ్వు వెంకన్న, మహిళా అధ్యక్షురాలు రాధిక, నాయకుడు కారుపోతు ల ముఖేష్‌గౌడ్‌లతో పాటు మరో 15 మంది, తొర్రూరు మండలం అమర్‌సింగ్ తండా కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హపావత్ సురేశ్‌నాయక్ తదితరులు, ఐనవోలు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ అడ్డగూడి సతీశ్‌కుమార్, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ తండా వెంకన్న, పుల్యాల రాజిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
వీరి తో పాటు కొండాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పా ర్టీ సీనియర్ నాయకులు సదానందం, కొండ యాక య్య, కక్కెర్ల చంద్రయ్య, సంతోష్‌కుమార్, మహ్మద్ రియాజ్, గరిసెల నరేశ్‌తోపాటు మరో 20 కుటుంబాలు గులాబీ తీర్థం పుచ్చుకోగా, వారికి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు కేసీఆర్‌ను కాదనుకుని ఓ మాయలోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టారని అన్నారు. స్థాని క సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించినట్లయితే రేవంత్‌రెడ్డి కండ్లు తెరుచుకుంటాయని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఐనవోలు మాజీ వార్డు సభ్యుడు కొత్తూరి రాజు, నాయకు లు బొల్లెపల్లి రాజేశ్, బొల్లెపల్లి మల్లేష్‌గౌడ్, చాగంటి యాదగిరి, తాళ్లపల్లి రాజు, అల్గునూరి రవి, అల్గునూరి శివప్రసాద్, మేరుగు రవీందర్ తదితరులు ఉన్నారు.
ఆ యా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు గుగులోత్ ఆక్రిరాంజీనాయక్, మాలోత్ వసుంధర్నాయక్, చిన్నాల వనజ, చిర్ర దేవేంద్ర శ్రీనివాస్, చినపాక రజిత, గద్దల రాంచంద్రు, గుగులోత్ రమేశ్, గుగులోత్ బుజ్జ మ్మ, రఘువంశీతో పాటు నా యకులు గుడిపూడి గోపాల్‌రావు, పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, రంగు కుమార్, పూస మధు, కుందూరు రాంచంద్రారెడ్డి, తేరాల యాకయ్య, ఎన గందుల యాక నారాయణ, కందికట్ల స్వామి, దొమ్మాటి సుభాష్, చిన్నాల శ్రీనివాస్, పనికర విజయ్‌కుమార్, ఎద్దు రమేశ్, పసుమర్తి సీతారాములు, తూర్పాటి అంజయ్య, మంగళపల్లి శ్రీని వాస్, నల్లమాస ప్రమోద్ కుమార్, అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్, ఎన్నమనేని శ్రీని వాస్, పసుమర్తి సీతారాములు, మోహన్, రామ్మూర్తి, సురేశ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎర్రబెల్లి వీరాభిమాని ఊడుగుల ఉప్పలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, దయాకర్‌రావు ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.