నర్సంపేట, సెప్టెంబర్ 25: బీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ రెండో వార్డు కమలాపురం పరిధిలోని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన 40 కుటుంబాలు సోమవారం క్యాంపు కార్యాలయంలో పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా అవసరాలను గుర్తించి, అందుకనుగుణంగా పథకాలకు రూపకల్పన చేసి విజయవంతంగా ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. జనరంజక పాలన అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్ది స్పష్టం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు మల్లూరి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొంగె మల్లేశ్, టీడీపీ నాయకుడు తోట వెంకన్న, బీజేపీ నాయకుడు ఏశబోయిన రాజేశ్ ఆధ్వర్యంలో ఏశుపతి, శ్రీను, రాజు, నరేశ్, మహేశ్, కుమారస్వామి, జాకీర్, రాజు, రవితేజ, రాకేశ్, సతీశ్, నాగరాజు, వీరస్వామి, వెంకన్న, అప్జల్, మల్లయ్య, రాజు, శివ, శ్రీను, వీరస్వామి, సరిత, విజయ, పద్మ, రజిత, మమత, కల్యాణి, భవాని, శశిరేఖ, దీపిక, విజయ, భద్రమ్మ, ప్రభావతి, సుజాత, రజిత ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, కౌన్సిలర్ జుర్రు రాజు, నల్లా మనోహర్‌రెడ్డి, పోతరాజుబాబు, దండిగ రమేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణ
నల్లబెల్లి: మండలంలో రోజురోజుకూ బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని రంగాపూర్, అర్శనపెల్లి, బోల్లోనిపల్లెకు చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన 60 కుటుంబాల కార్యకర్తలు నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనను ఈ ప్రాంత ప్రజలు అక్కున చేర్చుకుని ఆదరించడం వల్లే ఈరోజు ప్రజల రుణం తీర్చుకునే అవకాశం లభించిందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. కోట్లాది రూపాయల నిధులతో మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు.
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గృహలక్ష్మీ పథకంలో పేదల సొంతింటి కల నేరవేరనుందన్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న మద్దతును జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరం సంజీవరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీలు బానోత్ సారంగపాణి, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు ఎన్ రాజారాం, కరివేదుల వెంకట్‌రెడ్డి, లూనావత్ వెంకన్ననాయక్, లింగమూర్తి, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్‌గుప్తా, ఇంగ్లీ శివాజీ, మాలోత్ ప్రతాప్‌సింగ్, మోహన్‌రెడ్డి, రంగాపురం సర్పంచ్ చీకటి ప్రకాశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో అర్శనపెల్లి నుంచి రాంబాబు, బాలకట్టయ్య, నరేశ్, కల్యాణ్, భద్రయ్యతోపాటు 15 కుటుంబాలు, రంగాపూర్ నుంచి మార్త రాజు, రాజబాబు, నర్సింహస్వామి, మహేందర్, సునీల్, సాంబయ్య, వెంకటనర్సు, నరేందర్, సమ్మయ్య, కరుణాకర్‌రెడ్డి, సుమన్, రాజు, చంద్రబాబు, పవన్‌తోపాటు 40 కుటుంబాలు ఉన్నాయి.