రామా శ్రీనివాస్ ఇకలేరు
ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలీ క్లబ్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. వరంగల్‌లోని రామన్నపేటకు చెందిన ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశా రు.
- మోక్షారామం ఫౌండేషన్ వ్యవస్థాపకుడి ఆకస్మిక మృతి
- హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో గుండెపోటుతో తుదిశ్వాస
- వరంగల్ నగరంలో విషాదం
పోచమ్మమైదాన్, జనవరి 9 : ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలీ క్లబ్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. వరంగల్‌లోని రామన్నపేటకు చెందిన ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశా రు. ఆయన హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు, నగరవాసులు, పద్మశాలి కులస్తులు తట్టుకోలేకపోతున్నారు. శ్రీనివాస్ భౌతికకాయాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు సందర్శించి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. వరంగల్ నుంచి చాలామంది కడసారి చూసేందుకు తరలివెళ్లారు.
సేవా కార్యక్రమాలతో గుర్తింపు
పారిశ్రామికవేత్తగా ఎదిగిన శ్రీనివాస్, అనేక సేవా కార్యకమాలు చేశారు. తల్లిదండ్రులు ఆగయ్య-ఉప్పలక్ష్మి కోరిక మేరకు రామన్నపేటలో మోక్షారామం ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తద్వారా పేదలు, వృద్ధులు, అనాథల కు సేవలందించారు. రామన్నపేటలో రూ.50లక్షలతో శ్మశానవాటికను అభివృద్ధి చేశారు. అనాథ మృతదేహాల కు ఆయనే అంత్యక్రియలు చేయించేవారు. మోక్షారా మం ఫౌండేషన్ ద్వారా రామన్నపేటలో సొంత భవనం నిర్మించి, నిత్యం వృద్ధులు, అనాథలకు అన్నదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 250 మందికి మంగళసూత్రా లు, బట్టలు, నగదు సహా యం చేసి పెళ్లి పెద్దగా నిలిచారు. కాశీలో పద్మశాలి సత్రానికి రూ.కోటి, తిరుపతిలో పద్మశాలి సత్రానికి రూ. కోటి, శ్రీశైలంలో అన్నదానం కోసం రూ. 10 లక్షలు, వేములవాడలో నిత్యాన్నదానం కోసం రూ. 8 లక్షలు, గెస్ట్‌హౌస్ కోసం రూ.53లక్షలు, బాసర ఆలయానికి రూ.30లక్షలు, అయోధ్యలో స్థలం కోసం రూ. కోటి, సత్రాల కోసం రూ.50లక్షలు, యాదగిరిగుట్ట కు రూ.30 లక్షలు, రామజన్మభూమి కోసం రూ. 25 లక్షలు విరాళం ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ నిర్వహణ కోసం రూ.2 కోట్ల విలువైన 420 రిక్షాలు, లక్ష డస్ట్బిన్లు అందించారు. హంటర్ రో డ్డులో రూ.50 కోట్లతో వరల్డ్ పద్మశాలి భవనానికి శ్రీకా రం చుట్టారు. రూ.40 కోట్లు సొంతంగా రూ.10 కోట్లను పద్మశాలీల నుంచి వాటాధనంగా సమకూర్చా రు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
నేడు అంత్యక్రియలు
శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి నాయుడు పెట్రోల్‌పంప్ సమీపంలోని ప్రైవేట్ స్కూల్ వద్దకు భౌతికకాయాన్ని తరలించారు. ఉదయం 10గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం రామన్నపేటలోని శ్మశానవా టిక వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. మోక్షారామం ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసిన శ్మశానవాటికలోనే అంత్యక్రియలు జరుగనున్నాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

