నర్సంపేట రూరల్, జూలై13: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వల్లభ్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ది హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించలేదన్నారు. హస్తం నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాని సూచించారు. తెలంగాణ రైతాంగానికి రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేదలు, రైతులకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.
తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. హస్తం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మ-ప్రసాద్, దేవోజు తిరుమల, శీలం రాంబాబు, మినుముల రాజు, జుర్రు రాజు, పాషా, నాయకులు దేవోజు సదానందం, గుంటి కిషన్, పుట్టపాక కుమారస్వామి, గోనె యువరాజ్, దండిగ రమేశ్, పుల్లూరు స్వామి, రాంబాబు, కుమారస్వామి, రాయిడి దుష్యంత్‌రెడ్డి, గంప రాజేశ్వర్‌గౌడ్, మండల శ్రీనివాస్, నాయిని సునీత, రాయరాకుల సారంగం, ఇర్ఫాన్, సతీశ్, పెండ్యాల యాదగిరి, ఎదురబోయిన రామస్వామి, వాలస సత్యం, మామిడాల భిక్షపతి, శేర్ల శ్రీనివాస్, పస్తం కృష్ణ, గ్యార శ్రీకాంత్ పాల్గొన్నారు.