వరంగల్, జూన్ 19 : కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చేసిన ఘాటు వ్యాఖ్యలు చిచ్చు రగిలించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్‌గా ఆయన చేసిన విమర్శలు పార్టీలో కలకలం రేపాయి. ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఇజ్జత్ ఉంటే రాజీనామాలు చేయాలని ఆయన చేసిన సవాల్ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన హాట్ కామెంట్స్, సవాళ్లు చర్చనీయాంశంగా మారాయి.
పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ జన్మదిన వే డుకలో కొండా మురళి ప్రసంగం అంతా కడి యం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిలే టార్గెట్‌గా సాగింది. ఎన్నడూ ఎక్కువగా మాట్లాడని ఆ యన ఈ సారి ప్రసంగం అంతా సంచలన వ్యాఖ్యలు, సవాళ్లతో సాగింది. కడియం శ్రీహరిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పోల్చడం, టీడీపీని భ్రష్టుపట్టించి, చంద్రబాబును వెన్నుపోటు పొడిచి, టీఆర్ఎస్లో చేరి కేసీఆర్, కేటీఆర్‌ను తప్పుదోవ పట్టించిన వ్యక్తి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారో అని ఘాటు వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వ ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి టార్గెట్‌గా కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
గతం లో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరిలు బాహాటంగా విమర్శలు చేసుకోవడం, పోలీసు కేసులు పెట్టుకోవడం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లో చర్చనీయాంశమయ్యాయి. మంత్రి సురే ఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొండా మురళి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల ముసలోడు, దరిద్రుడు వచ్చాడు. తన కాళ్లు పట్టుకుంటే ఎమ్మెల్యే చేశానని చేసిన హాట్ కామెంట్లతో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు కొండా సుష్మిత పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించి ఇటు స్థానిక ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు.
పోచమ్మమైదాన్, జూన్ 19: ‘పరకాలలో దరిద్రమైన నాయకు డు.. 75 ఏండ్ల ముసలోడు వ చ్చిండు. ఆనాడు నా రెండు కాళ్లు పట్టుకుండు. నన్ను ఒక్కసారి గెలిపించమని బతిమిలాడితే ఎమ్మెల్యే ను చేసినం’ అని పరకాల ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశా డు. గురువారం వరంగల్ పోచమ్మమైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో కొండా మురళి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కడియం శ్రీహ రి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశా రు. ‘ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’ అని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.
సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశానని చెప్పుకొని తిరిగిన నాయకులు గతంలో వారు పనిచేసిన పార్టీలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ‘నిన్న.. కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ పార్టీని భ్రష్టుపట్టించారు. అంతకుముందు చంద్రబాబును భ్రష్టుపట్టించి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పార్టీని ఆగం చేస్తున్న నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నా’ అం టూ సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. కేవలం మంత్రి పదవి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి చర్యలతో పార్టీకి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ‘రేవంతన్నా… మీకు ఒకటి చెప్పదలుచుకున్నా.. వరంగల్‌లో కొంతమంది నాయకులు తెలుగుదేశంలో 15 సంవత్సరాలు ఉండి ఆ పార్టీని భ్రష్టుపట్టించారు. మంత్రి పదవులు అనుభవించి.. చంద్రబాబును ఓడించారు.
మళ్లీ కేసీఆర్ దగ్గర చేరి మంత్రి పదవులు అనుభ వించి పాపం ఆయనను తప్పుదోవ పట్టించి నాశనం చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో పార్టీలో చేరి ఏమి చేస్తారో తెలియదు. ఇసొంటోళ్లతోని మనం జర జాగ్రత్తగా ఉండాలె’ అని మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఉద్దేశించి సీఎంకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పరకాలలో తన కూతురు సుశ్మిత ఎమ్మె ల్యే అవుతుందన్నారు. తానూ ఎమ్మెల్సీ అవుతానని చెప్పారు. మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పులో ఉంటారని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో కొండా మురళి, సురేఖ వ్యవహార శైలి ఏ పార్టీలో ఉన్న వివాదాస్పదంగా ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వారికి సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యత లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. ఉమ్మడి జిల్లాలో అందరూ ఒక వైపు కొండా ఒక వైపుగా ఉన్నారు. కొండా సురేఖ, మురళి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని నిజమైన కాంగ్రెస్ అభిమానులు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పటి నుంచి పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తలు పార్టీలోని గ్రూప్ విభేదాలతో నలిగిపోతున్నారు. సొంత ఎజెండాతో వర్గ విభేదాలు సృష్టించి పార్టీని ప్రజల్లో చులకన చేస్తున్నారని దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.