హనుమకొండ, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం పబ్లిక్‌గార్డెన్‌లో ప్రాంతీయ కాలు ష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మొకలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానవాళి అవసరాల కోసం చేపడుతున్న చర్యలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు. ము ఖ్యంగా భూమిపై ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల భూ మి నిస్సారమవుతున్నదన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్లాస్టిక్‌ను వాడకుండా చర్యలు తీసుకున్నారని, అలాగే కలెక్టరేట్ సముదాయంలో ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర వస్తువులను ఉపయోగించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పదేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్‌వో లావణ్య, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత పాల్గొన్నారు. అలాగే, హంటర్‌రోడ్డులోని కాకతీయ జూపార్కులో ఎఫ్ఆర్వో మయూరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఎఫ్‌వో లావణ్య పాల్గొని మాట్లాడారు. అనంతరం చిత్ర లేఖనం, వ్యాచరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ కార్య నిర్వాహకురాలు కల్పన, జూపార్కు సిబ్బంది రాందాస్, గౌతమి, అశోక్, శారద, సురేశ్, బ్రహ్మ కుమారీస్ రాజయోగ టీచర్ శ్రీవాణి పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో మొక్క లు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పేరుతో కోట్లాది మొకలు నాటించారన్నారు. నాయకులు ఉడుతల సారంగపాణి, కేశవరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చాగంటి రమేశ్, రవీందర్, దామోదర్‌రెడ్డి, బొల్లు రవి పాల్గొన్నారు.
నమస్తేతెలంగాణ నెట్వర్క్ : పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నర్సంపేట ఎఫ్ఆర్వో రవికిరణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పాకాల అభయారణ్యంలో అటవీ శాఖ, నర్సంపేట విజ్డమ్ పాఠశాల ఎన్సీసీ కేడెట్లు వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు పాకాల కట్టపై ఉన్న ప్లాస్టిక్, చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంతో పాటు మొక్కలు నాటారు. హనుమకొండలోని స్వధార్ మహిళా ఆశ్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనితారెడ్డి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వడ్డేపల్లి సెక్టార్ సూపర్వైజర్ కవిత ప్రశాంత్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. ఆత్మకూరు జీపీ, మా సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటారు. వైద్యాధికారి ముతేర్ రహమాన్ కొత్తపల్లిలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వంగరలోని ప్రభుత్వ దవాఖానలో మొక్కలు నాటారు. సుబేదారి ఆర్ట్స్ కాలేజీ ఎన్సీసీ కేడెట్స్ టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ చాలెంజ్ ర్యాలీ నిర్వహించారు. కాలేజీ నుంచి కలెక్టరేట్ మీదుగా అదాలత్.. మళ్లీ అకడి నుంచి కాలేజీకి ర్యాలీ తీశారు. దామెర మండలంలోని తక్కళ్లపహాడ్, దామెర, కోగిల్వాయి, పులుకూర్తి, ఊరుగొండలో మహిళలు మొక్కలు నాటారు. ఆత్మీయ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బస్తీ బడిలో ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పరకాల ఎక్సైజ్ సీఐ తాతాజీ అన్నారు. కాట్రపల్లి వన సంరక్షణ సమితి ఆధ్వర్యం లో 200 మొక్కలు నాటారు. అలాగే, నెక్కొండ మండలం రెడ్లవాడతోపాటు పలుచోట్ల అమృత్ సరోవర్ కుంటలపై ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యం లో మొక్కలు నాటారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐనవోలు మండలంలోని పున్నేల్ గ్రామంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏవో కవిత గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి, ప్రతిజ్ఞ చేశారు. చెన్నారావుపేటలో ఎంపీడీవో గోవిందరావు ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ నిర్వహించారు. పర్వతగిరి ఎంపీడీవో శంకర్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులు, ఉపాధిహామీ కూలీలు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.