హనుమకొండ చౌరస్తా, నవంబర్ 7: హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్) సీఈసీ విద్యార్థిని జే.పండు అథ్లెటిక్స్ 3 కిలోమీటర్ల పరుగు పందెంలో రాష్ర్టస్థాయి విభాగంలో పాల్గొని జాతీయ స్థాయికి ఎన్నికైన సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్.శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు రాజ్‌కుమార్ విద్యార్థిని అభినందించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాలేజీ నుంచి జాతీయస్థాయికి ఎన్నిక కావడం కాలేజీకి చాలా గర్వకారణమని, మరిన్ని పతకాలు సాధించి కాలేజీకి, జిల్లాకు పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.