గీసుగొండ. ఏప్రిల్ 21: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు, ఏనుమాముల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం రఘు ప్రశ్నించారు. జాన్పాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు.
మహాలక్ష్మి పథకం మినహా ఏ ఒక్క పథకం అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెడతామని ఆయన హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం ఖర్చులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.