వరంగల్, అక్టోబర్ 4 : ప్రసిద్ద భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు. ఉదయం మకర, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్, తోగుంట ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కాళేశ్వరం : కాళేశ్వరంలోని శుభనంద (పార్వతి), మహాసరస్వతి ఆలయాల్లో అమ్మవార్లు శుక్రవారం బ్రహ్మచారిణి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం గణపతి, లలితార్చన పూజ లు, పంచమి విశేష పూజ, గణపతి, నవగ్రహ, రుద్ర పంచసూక్త హోమం నిర్వహించారు. సాయంత్రం మూలమంత్ర చండీహోమం జరుగగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.