హనుమకొండ, నవంబర్ 24 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్క ములుగు జిల్లాలోనే రెండు విడతల్లో పల్లెపోరు పూర్తికానుండగా, అధికార యంత్రాంగం ఏ ర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ఏ వి డతలో ఏ మండలంలోని గ్రామ పం చాయతీలకు ఎన్నికలు నిర్విహించాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేశరు. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు సైతం ఖరారు కావడంతో ఇక నోటిఫికేషన్ రావడమే తరువాయి. ఏ గ్రామానికి ఏ రిజర్వేషనో తేలిపోవడంతో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎపుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో 317 జీపీలు, 2,754 వార్డులున్నాయి. మొదటి విడతలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని 91 జీపీలు, 800 వార్డులు, రెండో విడతలో దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 117 జీపీలు, 1,008 వార్డులు, మూడో విడతలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని 109 జీపీలు, 946 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 482 జీపీలు 4,110 వార్డులుండగా, మొదటి విడతలో గూడూరు మండలంలోని 41 జీపీలు, 354 వార్డులు, ఇనుగుర్తిలోని 13 జీపీలు, 112 వార్డు లు, కేసముద్రంలోని 29 జీపీలు, 254 వార్డులు, మహబూబూబాబాద్లోని 41జీపీలు, 338 వార్డు లు, నెల్లికుదురులోని 31 జీపీలు, 280 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రెండో విడతలో బయ్యారంలోని 29 జీపీలు, 252 వార్డులు, చిన్నగూడూరులోని 11 జీపీలు, 96వార్డులు, దంతాలపల్లిలోని 18 జీపీలు, 166 వార్డులు, గార్లలోని 20 జీపీలు, 184 వార్డులు, నర్సింహులపేటలోని 23 జీపీలు, 194 వార్డులు, పెద్ద వంగరలోని 26 జీపీ లు, 192 వార్డులు, తొర్రూరు మండలంలోని 31 జీపీలు, 276 వార్డులు, మూడో విడుతలో డోర్నకల్ మండలంలోని 26 జీపీలు, 218 వార్డులు, గంగారం మండలంలోని 12 జీపీలు, 100 వార్డు లు, కొత్తగూడలోని 24 జీపీలు, 202 వార్డులు, కురవిలోని 41 జీపీలు, 344 వార్డులు, మరిపెడలోని 48 జీపీలు, 396 వార్డులు, సిరోలులోని 18 జీపీలు, 152 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
జనగామ జిల్లాలోని 280 జీపీలు, 2,534 వా ర్డులకు సంబంధించి మొదటి విడతలో జనగామ, లింగాలఘనపురం, నర్మెట, తరిగొప్పుల మండలాల్లోని 74 జీపీలు, 668 వార్డులు, రెండో విడతలో బచ్చన్నపేట, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోని 117 జీపీలు, 1038 వార్డులు, మూడో విడతలో చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, ర ఘునాథపల్లి, జఫర్ఘడ్ మండలాల్లోని 89 జీపీలు, 828 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ములుగు జిల్లాలో 10 మండలాలు ఉండగా మంగపేట మండలానికి సంబంధించి కోర్టు కేసు ఉండగా అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. మొదటి విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్, గోవిందరావుపేట, రెండో విడతలో తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయి గూడెం, వాజేడు, వెంకటాపురం (నూగూరు)మండలాల్లోని జీపీలు, వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలుండగా, మొదటి విడతలో గణపురం, గోరికొత్తపల్లి, రేగొండ, మొగుళ్లపల్లి, రెండో విడతలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల, మూడో విడతలో మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లోని జీపీలు, వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో ములుగు మినిహాయించి అన్ని జిల్లాల్లో మూడు విడుతలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో 210 గ్రామ పంచాయతీలు, 1,986 వార్డులున్నాయి. మొదటి విడతలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపుర్ మండలాల్లోని 69 జీపీలు, 658 వార్డులు, రెండో విడతలో ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 73 జీపీలు, 694 వార్డులు, మూడో విడతలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండాల్లోని 68 జీపీలు, 634 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన దాదాపు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అవసరం మేరకు బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకున్నారు. సర్పంచ్ స్థానాలకు జంబో, వార్డు మెంబర్లకు చిన్న బాక్స్‌లు వినియోగించనున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను సైతం సిద్ధం చేశారు. సర్పంచ్ స్థానాలకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్లను వినియోగించనున్నారు. వీటన్నింటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఎన్నికల్లో మరో కీలకమైన ఓటరు జాబితాను సైతం సిద్ధం చేశారు.
ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన దాదాపు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అవసరం మేరకు బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకున్నారు. సర్పంచ్ స్థానాలకు జంబో, వార్డు మెంబర్లకు చిన్న బాక్స్‌లు వినియోగించనున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను సైతం సిద్ధం చేశారు. సర్పంచ్ స్థానాలకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్లను వినియోగించనున్నారు. వీటన్నింటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఎన్నికల్లో మరో కీలకమైన ఓటరు జాబితాను సైతం సిద్ధం చేశారు.