కమలాపూర్/నర్సింహులపేట, ఏప్రిల్ 16: ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించి వా రం రోజులు దాటినా గింజ ఎత్తలె.. కాం టా వేయలె. అసలు రైస్‌మిల్లుల కేటాయింపులే జరగలే. పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తూ అకాల వర్షానికి ఆగమవుతున్నా రు. కమలాపూర్ మండలంలోని కమలాపూర్, గూడూరు, ఉప్పల్, మర్రిపెల్లిగూడెం, కన్నూరు, భీంపల్లి, దేశరాజ్ప ల్లి, ఉప్పలపల్లి, వంగపల్లి, గుండేడు, శంభునిపల్లి తదితర గ్రామాల్లో ఈనెల 11న అధికారులు, నర్సింహులపేట మండలంలో 4, దంతాలపల్లిలో 10 కొనుగోలు కేంద్రాలను 14న ఎమ్మెల్యే రామచంద్రూనాయక్ ప్రారంభించారు.
కేంద్రాల్లో ధాన్యం పోసుకుని ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలతో వడ్ల రాశులను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రతిరోజూ వడ్లు ఆరబెట్టడం, కుప్ప చేయడం ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి ఐదు వేల గన్నీ సంచు లు మాత్రమే రావడంతో బార్దాన్ సరిపోదని సెంటర్ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులు దాటినా ఇప్పటి వరకు రైస్ మిల్లుల కేటాయింపు జరగకపోవడంతో ఎక్కడి కుప్పలు అక్కడే దర్శనమిస్తున్నా యి. రైస్‌మిల్లుల కేటాయింపు చేస్తారని రైతులు గన్నీ సంచుల్లో ధాన్యం నింపుకుని కుప్ప వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే పరిస్థితి లేదని అగ్గువ సగ్గువకు దళారులకు అమ్ముకుంటున్నారు.
కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి పదిరోజులైతాంది. ఎప్పుడు వాన వస్తదోనని భయపడుతున్న. నింపుదామంటే సంచులు లేవంటున్నరు. రైస్‌మిల్లులు కేటాయించలేదంటున్నరు. కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్న.
– కొండం శ్రీనివాస్‌రెడ్డి, రైతు, గూడూరు
ధర ఎక్కువ వస్తుందని కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చిన. రాత్రి వర్షం వచ్చి వడ్లు తడిసినయ్. మళ్ల ఎం డ పెట్టాలంటే కూలీలు దొరకడం లేదు. కాంటాలు తొం దరగా పెడితే తిప్పలు తప్పుతయి.
– పీ విజయలక్ష్మి, రైతు, నర్సింహులపేట