వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
పోచమ్మమైదాన్, జూన్ 28: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌గా దీటుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భా గంగా 3వ డివిజన్ పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రూ. 33 లక్షలతో నిర్మించ నున్న అదనపు తరగతి గదులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, కార్పొరేటర్ జన్ను షీబారాణి, పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మన బడి కన్వీనర్ దోమ కుమార్, యూపీఎస్ చైర్మన్ సంపత్, వైస్ చైర్మన్ రాజేందర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, గ్రామ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ప్రతినిధులు
వర్ధన్నపేట: జిల్లా నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను ప్రశాంతినగర్‌లోని ఆయన స్వగృహంలో కలిశారు. రైతులకు సబ్సిడీలు అందేలా ఏఎంసీ ప్రతినిధులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ కమ్మగోని స్వామిరాయుడు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.