గోవిందరావుపేట, ఆగస్టు 28 : ములుగు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి లక్నవరంలోని సమ్మక్క-సారక్క దీవిలో బసచేసిన ఆయన బుధవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి స్పీడ్ బోటు షికారు చేస్తూ లక్నవరం అందాలను తిలకించారు.
సరస్సు కట్ట, దీవులు, ఎత్తైన కొండలతో లక్నవరం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నదన్నారు. ములుగు ప్రాంత అందాలు బాగున్నాయని, ఈ క్రమంలోనే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గవర్నర్ పర్యటనకు సహకరించిన కలెక్టర్‌కు, పోలీసులకు, ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టూరిజం ఎండీ ప్రకాష్‌రెడ్డి, ఎస్పీ పి.శబరీష్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, శ్రీజ, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.