హనుమకొండ, డిసెంబర్ 8: చిన్నారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పర్యటన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఈనెల 18,19వ తేదీల్లో హనుమకొండలో పర్యటించనున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
బాలకార్మిక వ్యవస్థ, హక్కులు, చట్టాలు తదితర అంశాలపై ఆయన ఉపన్యసిస్తారని తెలిపారు. బాలల హకుల సంరక్షణ ప్రతి ఒకరి విధి అని వినోద్‌కుమార్ అన్నారు. బాలల హకుల రక్షణలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శం అన్నారు. తాను వ్యక్తిగతంగా కైలాష్సత్యార్థిని కలిసి జిల్లాకు రావాలని కోరినట్లు తెలిపారు. 18న పోక్సో కోర్టును సందర్శిస్తారని, 19న చిన్నారులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమం విజయవంతం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కైలాస్ సత్యార్థి పర్యటన విజయవంతం చేసేందుకు కమిటీలను నియమించనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి, హనుమకొండ అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఈవోలు అబ్దుల్‌హై, వాసంతి, కైలాష్ ఫౌండేషన్ ప్రతినిధి చందన, మున్సిపల్, విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.