హనుమకొండ, నవంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోలాహలం మొదలైంది. స ర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థా నాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ సర్కా రు జీవో జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోమవారంలోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభు త్వం జారీ చేసిన జీవో నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు.
ఈ పద్ధతి ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంతో పా టు రిజర్వేషన్ల ప్రక్రియ ను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఎంపీడీవోల ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు, ఆర్డీవోల ఆధ్వర్యంలో సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఈ జీవోలో గిరిజన గ్రామాలకు సం బంధించి ఒక ప్రత్యేక నిబంధనను ప్రభుత్వం చేర్చింది. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలను వారికే కేటాయించాలని స్పష్టం చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.
హనుమకొండ జిల్లాలో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామా లు ఐదు ఉన్నాయి. వేలేరు మండలంలో బండతండా, చింతల తం డా, లోక్యా తండా, అలాగే హసన్‌పర్తి మండలంలో హెచ్‌సీఎన్ తం డా, శాయంపేట మండలంలో సూర్యనాయక్ తండాలున్నాయి. వీటిల్లో సర్పంచ్, వార్డు సభ్యులను ఎస్టీలకే రిజర్వ్ చేయనున్నారు.
రెండు నెలల కిత్రం బీసీలకు 42 శా తంతో రిజర్వేషన్లు ఖరారు చేయగా తాజాగా పాత రిజర్వేషన్ పద్ధతినే ప్రభుత్వం అమలు చేస్తున్నది. దీంతో బీసీ స్థానాలు తగ్గి జనరల్ స్థానాలు పెరిగే అవకాశముంటుందని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రొటేష న్ పద్ధతిలో చేయనున్నారు. మహిళల రిజర్వేషన్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిన ఖరారు చేయనున్నారు.