ఐనవోలు/వర్ధన్నపేట/హసన్పర్తి, నవంబర్ 27 : కాంగ్రెస్ పార్టీ బోగ స్ హామీలను ప్రతి కార్యకర్త స్థానిక ఎన్నికల్లో గడపగడపకూ ప్రచారం చే సి ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. గురువారం ఐనవోలు, వర్ధన్నపేట, హసన్పర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ గ్రామ ఇన్చార్జిలు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. ముందుగా ఐనవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, మహిళా కార్యకర్తలు 120 మంది, గర్మిళ్లపల్లిలో ఇతర పార్టీల నుంచి 20 మంది నాయకులు ఎర్రబెల్లి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్, రేవంత్రెడ్డి పాలనలో కష్టాల కడలిలో కొనసాగుతున్నారని అన్నారు.
ఆనాడు కేసీఆర్ అందరికీ బతుకమ్మ చీరెలు ఇస్తే నేడు మోసపూరిత కాంగ్రెస్ మహిళా సంఘాల్లో ఉన్న వారికే ఇస్తున్నదన్నారు. స్థానిక ఎన్నికలు వచ్చే సరికి మహిళా ఓట్ల కోసం హడావిడిగా చీరెలను పంపిణీ చేసినట్లు ఎర్రబెల్లి గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అడ్డగోలు హామీలు ఇస్తున్నదని, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలన్నారు. పార్టీ క్యాడర్, యూత్ సోషల్ మీడియా నాయకులు ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసి సత్తా చాటాలని సూచించారు. ముఖ్యమంత్రి అసమర్థ, తప్పుడు విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని, అందుకని వారంతా బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయ ని, పార్టీ శ్రేణులు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేసుకొని విజయం దిశగా పాటు పడాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలని దయాకర్రావు కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి మెట్టు శ్రీను, మండల ఇన్చార్జి గోపాల్రావు, కన్వీనర్ తంపుల మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ తళ్లపల్లి చందర్రావు, రామ్మూర్తి, సొసైటీ చైర్మన్ జయపాల్రెడ్డి, మాజీ సర్పంచులు పల్లకొండ సురేశ్, ఉస్మాన్అలీ, కవాటి స్వామి, కంజర్ల రమేశ్, సదానందం, మాజీ ఉపసర్పంచ్ ఎల్లాగౌడ్, నాయకులు కుమార్, అశోక్, రఘువంశీ, రాజు, జయశంకర్, చింతల యాదగిరి, అన్నమనేని అప్పారావు, తూళ్ల కుమారస్వామి, గుజ్జ గోపాల్రావు, చొప్పరి సోమయ్య, హసన్పర్తి మండలాధ్యక్షుడు బండి రజనీకుమార్, 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, ఆత్మ మాజీ చైర్మన్ చంద్రమోహన్, విక్టర్బాబు పాల్గొన్నారు.