మధిర, మే 19 : ప్రజా సమస్య లను పరిష్కారం కోసం సుందరయ్య ప్రజా ప్రజా ప్రతినిధిగా ఎలా ఉండాలో చేసి చూపించిన గొప్ప వ్యక్తి అని మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. పట్టణలోని బోడెపూడి భవనంలో పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందరయ్య తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేశారని ప్రశంసించారు.
ఆయన చూపించినమార్గంలో ప్రజాప్రతినిధులు నడువాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, పట్టణ మండల కార్యదర్శి మందా సైదులు, టౌన్ కమిటీ సభ్యులు పాపినేని రామన్న, రాధాకృష్ణ, మండవ ఫణీంద్ర కుమారి, సుకూర్, సుందరయ్య, పెంటి వెంకటరావు, ఆది వెంకటేశ్వరరావు, మల్లాచారి, వడ్రానప మధు, వెంకట్రావు, వద్దండు సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.