నల్లబెల్లి/ నర్సంపేట, ఏప్రిల్ 23 : మేడేను జయప్రదం చేయండి బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సంపేట వ్యవసాయ గ్రేన్ మార్కెట్లో మేడే ను జయప్రదం చేయాలని కోరుతూ మార్కెట్ యార్డులో అమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరు లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి అమరులైన వారిని స్మరించుకోవాలన్నారు.
భవిష్యత్ పోరాటాలకు బాటలు వేయడానికి గత స్మృతులు జ్ఞాపకాలు నెమరు వేసుకొని కార్మిక ఉద్యమ నాయకులు చేసిన పోరాటాలను స్మరించుకొని జరుపుకునే మేడే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని అన్నారు. మేడే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాడువాయి యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెరమండ్ల రవి, హమాలీ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, మార్కెట్ నాయకులు మూట పెద్ద మనుషులు అన్నం రాజు, కడారి అనిల్, కుమారస్వామి, రాములు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.