హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 15 : అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనతో రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన హనుమకొండ జిల్లా పైడిపల్లికి చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్కి జిల్లాస్థాయి క్రీడాపురస్కారం, ప్రాశంసాపత్రం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో అందజేశారు.
బహ్రెయిన్‌లో జరిగిన ప్రపంచ పారా తైక్వాండో పూమ్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం, మలేసియాలో జరిగిన 10వ ఆసియా పారా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో గౌతమ్యాదవ్ వెండి పతకం సాధించారు. కాగా, ఆయన నిబద్ధత, పట్టుదల క్రీడా పట్ల ఉన్న అంకితభావం యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నది. ఈ ఘనత గౌతమ్ యాదవ్ క్రీడా ప్రతిభను కొనియాడేవిధంగా మాత్రమే కాక, రాష్ర్ట యువ క్రీడాకారులందరికీ ప్రేరణగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు.