నర్సింహులపేట ఆగస్టు 26 : అంగన్వాడీ సెంటర్లో గ్యాస్ సిలిండర్ మాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అంగన్వాడీలోని ఆయా వయోభారంతో విధుల నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో అంగన్వాడీ సెంటర్లో ఉన్న సిలిండర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
అయితే ఆయానే సిలిండర్ ఆపహరిచారని పోలీస్ స్టేషన్లో టీచర్ ఫిర్యాదు చేశారు. కాగా, నెల రోజుల క్రితమే అంగన్వాడీ సెంటర్ కి సంబంధించిన తాళం టీచరుకు అందించానని సదరు టీచర్నే సిలిండర్ అపహరించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయాన సైతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై గ్రామ ప్రజలు అవాక్కవుతున్నారు. సిలిండర్ మాయమైన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.