ఏటూరునాగారం, ఆగస్టు 25: ఎడ్లబండిపై గణనాథుడు, ఊయలలో గణపతి.. ఇలా తీరొక్క వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరుగుతోంది. నవరాత్రి ఉత్సవాలకు భక్తులను ఆకట్టుకునేలా ఏటూరునాగారంలో సిల్వర్, గోల్డ్ కలర్స్‌తో వీటిని తయారుచేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి క్రేజ్ ఉండడంతో ఏపీ నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.
మండల కేంద్రానికి చెందిన నాగభూషణరావు ఎడ్లబండిపై వినాయకుడి విగ్రహం తయారుచేస్తుండగా ఏపీలోని విజయవాడకు చెందిన ఎస్ రామారావు చూసి రూ. లక్షకు కొను క్కున్నాడు. పచ్చని గడ్డి, ఎడ్లబండిపై వినాయకుడు వెళ్తుండేలా దీన్ని రూపొందించారు. రోడ్డు పక్కనే విగ్రహాలను తయారు చేస్తుండడంతో చాలా మంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరో నాలుగు ఊయల ఊగే గణనాథుల విగ్రహాలను విజయవాడ ప్రాంతానికి చెందిన వారు బుకింగ్ చేసుకున్నారు. ఒక్కోదాని ధర రూ. 40 వేల నుంచి రూ. లక్ష దాకా ఉన్నాయి.
ఎడ్లబండిపై వినాయకుడి విగ్రహం రూ. లక్షకు అమ్ముడుపోయింది. దీనిని గుంటూరు జిల్లాలో నవరాత్రుల కోసం ప్రతిష్ఠించేందుకు తీసుకున్నారు. ఇక మరో నాలుగు ఊయలలో గణనాథుల విగ్రహాలను కూడా విజయవాడ వారే బుక్ చేసుకున్నారు. ఊయలను ఊపితే పాట వచ్చేలా తయారు చేశాం.
– నాగభూషణరావు, తయారీ దారుడు