కృష్ణ కాలనీ, జనవరి 3: గతంలో ఎంపిక చేసిన 392 మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు సోమవారంలోగా పట్టాలివ్వాలని, లేకుంటే అంబేదర్ సెంటర్లో నిరవధిక దీక్ష చేస్తానని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో పార్టీ అ ర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇండ్లు నిర్మిం చి ఇవ్వాలనే లక్ష్యంతో వేశాలపల్లి, భా సర్ గడ్డలో 955 నిర్మించి కలెక్టర్ సమక్షంలో 392 మందిని ఎంపిక చేశామన్నారు.
నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారికి పట్టాలివ్వకుండా నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇండ్ల కోసం లబ్ధిదారులు ధర్నా చేస్తే పోలీసులు వారికి ప్రభుత్వ పథకాలు రావని బెదిరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వచ్చి 13 నెలలు పూర్తవుతున్నా ఇండ్లు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటో కలెక్టర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే ఓ వెయ్యి కొత్త ఇండ్లు తీసుకువచ్చి నిరు పేదలకు కట్టించాలన్నారు.
బెదిరించి పార్టీ కండువాలు కప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు. లగచర్లలో గిరిజన రైతుల భూములను లాకోవాలని ప్రభుత్వం చూస్తే, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన నీచుడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ డ్యామేజైతే ఇప్పటి వరకు దానిని రిపేరు చేయించ లేదని, హామీలపై అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తు న్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలన్నారు.
మంతులు శ్రీధర్ బా బు, శ్రీనివాస రెడ్డి చొరవ తీసుకొని జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ తీసుకురావాలని, గతం లో ఎంపి క చేసిన లబ్ధిదారులకు వెంటనే ఇండ్ల పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నిరసన దీక్షకు టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజ య్య, వరింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేశ్ మాదిగ, ప్రధాన కార్యదర్శి పుల్ల సతీశ్ మాది గ, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శీలపాక హరీశ్ మాదిగ మద్దతు పలికారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కొత్త హరిబాబు, మంగళపల్లి తిరుపతి, మేకల రజిత, బానోత్ రజిత, ఎడ్ల మౌని క, దార పూలమ్మ, బద్ది సమ్మయ్య, ఆకుదారి మమత, యూత్ అర్బన్ అధ్యక్షుడు బుర్ర రాజు, బీఆర్ఎస్ నాయకులు కళ్లెపు రఘుపతిరావు, మండల విద్యాసాగర్ రెడ్డి, బీబీ చారి, చిరంజీవి, పోలవేణి అశోక్, శ్రీకాంత్ పటేల్, మామిడి కుమార్, దొంగల ఐలయ్య, యుగేంద్రాచారి, ప్రేమ్‌కుమార్, సంకటి మొగిలి, శ్రీనివాస్, మహేందర్, లట్ట రాజబాబు, గండ్ర యువసేన నాయకులు పాల్గొన్నారు.
నాకు ఇల్లు లేదు. నా భర్త ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఇల్లిస్తే కాంగ్రెస్ ప్రభు త్వం పట్టాలు ఎందుకిస్తలేదు. 13 నెలల నుంచి ఇం డ్ల పట్టాలివ్వాలని ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇండ్ల కోసం ధర్నా చేస్తుంటే పోలీసులు ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్ రూమ్‌లు, ఏ ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే మొండివైఖరిని వీడి ఇండ్లకు పట్టాలివ్వాలి.
– కోసరి రజిత, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారు
ఎమ్మెల్యేగా వచ్చేసారి గండ్ర వెంకటరమణారెడ్డి గెలవడం ఖాయం. ఏడాదికే భూపాలపల్లిలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వంతో మాట్లాడి మరో 500 ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. గత ప్రభు త్వం తమకు కేటాయించిన ఇండ్ల పంపిణీకి అడ్డుపడడం సరైంది కాదు.
– జీ నీలాంబరం, లబ్ధిదారుడు, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు