కృష్ణ కాలనీ, జూన్ 29 : సింగరేణి సంస్థకు ఉద్యోగులు వెన్నెముకలాంటి వారని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ భూపాలపల్లి పరిధిలోని ఉద్యోగులు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గం డ్ర హాజరై టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి దీక్షకు సంఘీభావం తెలిపి అనంతరం మాట్లాడారు.
కోల్ ఇండి యా స్థాయిలో ఉద్యోగులకు ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తున్నా రో, అలాగే సింగరేణి ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. 10 రోజులుగా సింగరేణి ఉద్యోగులు నిరసనలు తెలుపుతుంటే యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణిని ఆగం చేసిండని విమర్శించారు. సింగరేణి ఉద్యోగుల బాధలు తెలుసుకున్న కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో వారికి పనితీరు ఆధారిత చెల్లింపు (పీఆర్పీ) ఇ చ్చారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ మూడేళ్ల నుంచి పీఆర్పీ ఇవ్వలేదని, వెంటనే చెల్లించాలని, సింగరేణిలో స్ట్రక్చర్ మీ టింగ్‌లు నిర్వహించాలన్నారు.
అలాగే సంస్థకు రాష్ట్ర ప్రభు త్వం ఇవ్వాల్సిన రూ. 56 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు కటకం జనార్దన్, కౌన్సిలర్లు భోగం నరేందర్, మోతె రాజు, జ్యోతుల మంజులా వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ నాయకులు దేవరకొండ మధు, రత్నం అవినాశ్‌రెడ్డి, సుంకరి గోవర్ధన్, శశికాంత్‌గౌడ్, మహేందర్ పటేల్, నాయకులు సెగ్గం సిద్ధు, మాడ హరీశ్‌రెడ్డి, జకం రవికుమార్, పిల్లివేణు, ముంజంపల్లి మురళీధర్, శ్రీనివాస్, కట్ట నరసింహచారి, రమణారెడ్డి, సుమన్, ఆరే బాబు, రాజశేఖర్, సుమన్, మనోహర్, తిరుపతమ్మ, స్వప్న, ఉద్యోగులు పాల్గొన్నారు.