కృష్ణకాలనీ, డిసెంబర్ 20: ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాల జాబితాలో చేర్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసులను వెంటనే ఎత్తివేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ పెట్టే కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు. కేటీఆర్‌పై ఏసీబీ పెట్టిన కేసులను ఖండిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
హైదరాబాద్ ఇమేజీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈ-కార్‌ను నిర్వహించారని, దీంతో రూ.700 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో చర్చిద్దామని కేటీఆర్ ప్రతిపాదిస్తే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏడాది నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మిగతా మంత్రులు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరుల అరెస్ట్ చేసి వారి గొంతు లు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇటీవల లగచర్లలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి 35 రోజులు జైల్లో పెట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా 6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చేంతవరకు బీఆర్ఎస్ పేదల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందన్నారు. కాగా, ధర్నాచేస్తున్న గండ్రను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా బీఆర్ఎస్ శ్రేణు లు, యూత్ నాయకులు అడ్డుకోగా కొద్దిసేపు తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయినప్పటికీ పోలీసులు గండ్రను పోలీసు వాహనం ఎక్కించగా దానిని కదలకుండా అడ్డుకున్నప్పటికీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం సొంత పూచీకత్తుపై గండ్రతో పాటు పార్టీ శ్రేణులను విడుదల చేశారు. ధర్నా సందర్భంగా గంట సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు చేసిన నినాదాలతో భూపాలపల్లి దద్దరల్లింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్‌యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, అర్బన్ యూత్ అధ్యక్షు డు బుర్ర రాజు, కౌన్సిలర్లు కొత్త హరిబాబు, మంగళప ల్లి తిరుపతి, ముంజంపల్లి మురళీధర్, ఆకుదారి మమ త, దార పూలమ్మ, ఎడ్ల మౌనిక, జకం రవికుమార్, బానోత్ రజిత, మేకల రజిత, మాజీ జడ్పీటీసీలు గొర్రె సాగర్, జోరుక సదయ్య, మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్‌రెడ్డి, నాయకులు బండారు రవి, బీబీ చారి, పొలుసాని లక్ష్మీనరసింహారావు, దొంగల ఐలయ్య, పోలవేను అశో క్, ప్రవీణ్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.