భూపాల్ పల్లి రూరల్ ఏప్రిల్ 21 : బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి వంద మంది తరలి రావాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి, శ్యామ్ నగర్, ఎస్ ఎం కొత్తపల్లి గ్రామాలలో ఈనెల 27న ఎలుకతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి వంద మందికి తక్కువ కాకుండా సభకు హాజరుకావాలని అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రజతోత్సవ బహిరంగ సభను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, వేణుగోపాల్ రెడ్డి, సదానందం, తదితరులు పాల్గొన్నారు.