భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 6 : కాంగ్రెస్ నాయకులు ఇస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి పట్టణంలోని 2,9,17, 27,29, వార్డుల్లో ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి బండా ప్రకాశ్‌తో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్లేనని, భూపాలపల్లి నియోజకవర్గంలో కమీషన్ల పాలన కొనసాగుతుందని, అవినీతి పెరిగిందని, పర్సేంటీజీలు లేక పోతే పనులు జరగవన్నారు.
ప్రశ్నించిన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి పను లు జరిగాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగ నంపాలని పిలుపునిచ్చా రు. 2, 9, 17, 27, 29 వార్డు అభ్యర్థులు కోల రాయమల్లు, పిల్లి వేణు, బేతోజు వజ్రమణి, వాసాల ఈశ్వరమ్మ, గండ్ర హరీశ్రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బండా ప్రకాశ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో జిల్లాలను ఏర్పాటు చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను తొలగించే కుట్రలు పన్ను తున్నదని అన్నారు.
భూపాలపల్లి జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి కాంగ్రె స్కు బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ద న్, గ్రంథాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేశ్, పీఏసీఎస్సీ మాజీ చైర్మన్ మేకల సంపత్, మాజీ జడ్పీటీసీ లట్ట రాజబాబు, మాజీ కౌన్సిలర్ మురళీధర్, 9వ వార్డు అధ్యక్షులు సంకటి మొగిలి, మాజీ ఫ్లోర్ లీడర్ నూనెరాజు, నాయకులు మర్రి బాపు, బడితల శ్రీధర్, విజేందర్ రెడ్డి, నూనె సుధాకర్, దేవేందర్, వాసాల రవి, లక్ష్మయ్య, లక్కం దేవేందర్, తిరుపతి, రఘుపతి, వంశీ, వా సాల స్వప్న, వార్డు అధ్యక్షులు కవ్వంపల్లి శేఖర్, కుంభం క్రాంతి, దామెర రాజు పాల్గొన్నారు.