రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
రైతులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మక్కల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సోమవారం చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు.
- వారికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- మక్కల కొనుగోళ్లలో అక్రమాలపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా
చిట్యాల, జూలై 6 : రైతులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మక్కల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సోమవారం చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు. అప్పుడు రైతులు తాము పండించిన ధాన్యాన్ని సైతం అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు వాటి డబ్బులను కటిం గ్ చేస్తున్నారన్నారు. మకల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి రైతు లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా యాప్పై సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని, ఆ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతినే పునరుద్ధరించాలన్నారు.
రైతు భరోసా సకాలంలో అందడం లేదని, కాళేశ్వరం నీటిని సమర్థవంతంగా వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందేదని, ప్రస్తుతం 12 గంటలు కూడా అందడం లేదన్నా రు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా పెరిగిందని, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అక్రమ పాలన సాగుతుందన్నారు. నియోజకవర్గంలో రావుల పాలన రాజ్యమేలుతుందని, ఎమ్మెల్యే బావమరుదులు అవినీతి పాలనకు తెర లేపుతున్నారని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రైతులకు హామీలు ఇచ్చి విస్మరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు, ప్రజలు పాతాళంలోకి తొకేస్తారన్నారు. వచ్చే బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తా మన్నారు. అనంతరం సీఐ మల్లేశ్, ఎస్సై సతీశ్ కుమార్ ధర్నాను విరమింప చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ కుంబం క్రాంతికుమా ర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు గొర్రె సాగర్, జోరుక సదయ్య, పార్టీ టౌన్ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ గౌడ్, మండల వరింగ్ ప్రెసిడెంట్, యూత్ మండల అధ్యక్షుడు నవీన్, మండల ప్రధాన కార్యద ర్శులు ఏరుకొండ రాజేందర్, మడికొండ రవీందర్రావు, నాయకులు కర్రె అశోక్ రెడ్డి, పుట్టపాక మహేందర్, దామెరబోయిన నారాయణరావు, దామెర రాజు, ఏరుకొండ రఘు, కాట్రేవుల కుమార్, శ్రీనివాస్, భూక్యా మోహన్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీ టీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

