మొగుళ్ళపల్లి, ఏప్రిల్ 9 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన బతుకలు బాగుపడుతాయని కేసీఆర్ 2001 ఏప్రిల్ 27 తన పదవికి రాజీనామా చేశారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేసేందుకు మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల గ్రామాల్లోని ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక లక్ష్యంతో నాడు కేసీఆర్ పార్టీ పెట్టారని తెలిపారు.
పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు.