నల్లబెల్లి, జనవరి 30: మండలంలో ‘మన ఊరు- మన బడి’ కింద మొదటి విడుతలో పది పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ స్కూళ్లలో అదనపు తరగతి గదు లు, విద్యుద్దీకరణ, నీటి వసతి, మైనర్ రిపేరింగ్, వంట శాలలు, కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, మూత్రశాలలతోపాటు అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లు విడుదల చేసింది. ఇందు లో రేలకుంట, నల్లబెల్లి ఎంపీపీఎస్లను మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫిబ్రవరి 2న ఈ స్కూళ్లను ప్రారంభానికి ముస్తాబు చేసేందుకు అధికారు లు, ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.
నల్లబెల్లి ఎంపీపీఎస్కు రూ. 7 లక్షలు
నల్లబెల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్కు ప్రభు త్వం రూ. 7 లక్షల నిధులు మంజూరు చేసింది. వీటితో పాఠశాలలో విద్యుద్దీకరణ, మేజర్, మైనర్ రిపేరింగ్ పనులు, తాగు నీటి వసతి కల్పించారు. మెగా కంపెనీ వారు అదనపు నిధులతో కలరింగ్ పనులు చేశారు.
సంగెం మండలంలోని మొండ్రాయి ప్రాథమిక పా ఠశాలకు ప్రభుత్వం రూ. 14. 50 లక్షలను మంజూరు చేసింది. దీంతో పాఠశాలలో ఎలక్ట్రికల్, మంచినీటి పనులు, టాయిలెట్స్ బ్లాక్స్ నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
వంద శాతం పనులు పూర్తి
– ఏఈ చందర్రావు
మోడల్ పాఠశాలల పను లు వంద శాతం పూర్త య్యా యి. ఫిబ్రవరి న జరిగే మన ఊరు మన బడుల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నా యి. సర్కారు బడులు కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగనుంది.
కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి
– శారద, హెచ్ఎం, రేలకుంట ఎంపీపీఎస్
గతంలో వసతులు లేక వి ద్యార్థుల సంఖ్య తగ్గింది. రాష్ట్రప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కింద సర్కారు పా ఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో నేడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందడం అభినందనీయం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అందరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. తద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది.