Friends | రామవరం, ఆగస్టు 3 : ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ తల్లి నీడలో అని సినీ కవి రాసిన పాటకు నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యం. సింగరేణి హైస్కూల్ రుద్రంపూర్ విద్యార్థులు, పదవ తరగతి చదివి 31 సంవత్సరాలు అయిపోయినప్పటికీ, ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం అంటే అందరూ ఎక్కడ ఉన్న, ఎన్ని పనులున్నా, బాధ్యతలను పక్కకు పెట్టి, బాధ్యతగా స్నేహితుల దినోత్సవాన్ని ఒకచోట కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు, స్నేహితులంటే మీరే అన్నట్టు వీరంతా ఆదర్శంగా నిలుస్తున్నారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గతంలో ఉన్న రుద్రంపూర్ సింగరేణి హై స్కూల్ లో 1993 -1994 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల కోసం వారందరూ విడిపోయి, ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. కొందరు ఉన్నత స్థానాల్లో ఉంటే మరికొందరు పలు ఉద్యోగాలు, పనుల్లో ఉన్నప్పటికీ వారు ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవ సందర్భంగా తప్పకుండా కలుసుకుంటారు. తమ తమ హోదాలను తమ అంతస్తులను పక్కకు పెట్టి, డ్రెస్ ధరించి ధరిస్తారు.
తమ దుస్తుల్లో, తమ చేష్టలలో ఎక్కడ కూడా తమ హుందాతనం ఆగుపడకుండా.. తాము అందరం ఒకటే అనే భావన కల్పించినందుకు ప్రతీ సంవత్సరం తాము చదువుకున్న స్కూల్ పేరుతో ఉన్న టీ షర్టులను ధరించి, అన్ని మరిచి తమ స్నేహితులతో గడుపుతారు, ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకుంటారు. తమలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అండగా నిలుస్తారు. ఆర్థికంగా బాగా లేని స్నేహితుల పిల్లల చదువులకు అయ్యే ఆర్థిక సహాయం కూడా వారు అందించుకుంటారు.
ప్రతీ సంవత్సరం ఇలా కలుసుకోవడం..
తమకు ప్రాంతము, జాతి ,మతం అనేవి తమ దరిదాపులో ఉండవని.. ప్రతీ సంవత్సరం ఇలా కలుసుకోవడం వల్ల యోగక్షేమాలు తెలుసుకోవడమే కాకుండా ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఏం చేస్తే బాగుంటుందని చర్చించుకుంటామని తెలిపారు. ప్రతీ సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో ఫ్రెండ్షిప్ డే పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించుకుంటారు.
ఆదివారం స్నేహితుల దినోత్సవం పాములేరులో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు నిర్వహించుకొని, ఆటపాటతో ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో హనోక్ రాజ్, జోసఫ్, ఆది రామచందర్, కోడం వరప్రసాద్, బూర్గుల రాంద్రప్రసాద్, కంచె శ్రీనివాస్,బొక్క రామకృష్ణ, బొంతు శ్రీనివాస్, కుక్కల సారయ్య, నూతన్ బాబు, విజయ రాజు, మాతంగి రవికుమార్, సంగం రమేష్, పీటర్ రామకృష్ణ, సదానందం, బి .రవి కుమార్, హరిబాబు తదితరులు ఉన్నారు